బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 16:11:44

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా మంగళవారం నౌకా విధ్వంసక క్షిపణిని ప్రయోగించింది. సుఖోయ్‌ యుద్ధవిమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గగనతలం నుంచి ఉపరితలంపైన ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. మంగళవారం ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్ సంగ్‌ జయంతి. ఈ సందర్భంగా ముంచోన్‌ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరం నుంచి విమానం ద్వారా సముద్రంపైకి ఈ స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కిమ్‌ ఇల్‌ సంగ్‌ మనవడే.  


logo