బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 13:38:16

చైనా నుంచి కోటిన్నర పీపీఈ కిట్లు

చైనా నుంచి కోటిన్నర పీపీఈ కిట్లు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా నుంచి కోటిన్నర వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో గౌన్లు, మాస్కులు, 15 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు ఉన్నాయి. చైనాలో ఉత్పత్తి అవుతున్న పీపీఈలు నాణ్యంగాలేవని యూరోపియన్‌ దేశాలు ఆరోపించిన నేపథ్యంలో వాటి ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షల కారణంగా భారత్‌కు ఎగుమతులు ఆగకుండా చూడాలని భారత అధికారులు చైనా ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తిచేశారు. భారత్‌ కోరిన పీపీఈల్లో ఇప్పటికే కొన్ని భారత్‌కు చేరాయని చైనాలో భారత రాయబారి విక్రం మిస్రి తెలిపారు. 


logo