ఆదివారం 31 మే 2020
International - Apr 13, 2020 , 19:41:16

ఇండోనేషియాలో దెయ్యాల వీధులు

ఇండోనేషియాలో దెయ్యాల వీధులు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల్లో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాకుండా నచ్చజెప్పటం, మాట వినకుంటే బలప్రయోగం చేయటం జరుగుతున్నది. అయితే ఇండోనేషియాలోని ఓ వీధిలో మాత్రం వినూత్న ఆలోచన ద్వారా సామాజిక దూరం పాటించేలా చేస్తున్నారు.

జావా ద్వీపంలోని కెపుహ్ గ్రామంలో ప్రజలు ఎంతచెప్పినా సామాజిక దూరం పాటించకపోవటంతో ఆ ఊరిలోని యువజన సంఘం ఓ ఉపాయాన్ని ఆలోచించింది. పోకోంగ్ అని పిలిచే దెయ్యాల బొమ్మలను వీధుల్లో అక్కడక్కడ ఏర్పాటు చేసింది. ఈ ముఖానికి తెల్లని పౌడర్ రాసి, తెల్లని దుస్తుల్లో చుట్టి మనుషుల్లాగే ఉండే ఈ బొమ్మల్లో ఆత్మలు ఉంటాయని ఇండోనేషియన్ల నమ్మకం. దాంతో రాత్రి పూట ఈ బొమ్మలను వీధుల్లో ఏర్పాటు చేయటంతో జనం బయటకు రావటానికి భయపడుతున్నారు. దాంతో భయంతోనైనా సామాజిక దూరం పాటిస్తున్నారని యువజన సంఘం నాయకుడు అంజర్ పంకానింగ్యేస్ తెలిపారు.   


logo