బుధవారం 27 మే 2020
International - Apr 13, 2020 , 19:42:25

వర్చువల్ వైశాఖి.. ఆన్లైన్లోనే కీర్తనలు

 వర్చువల్ వైశాఖి.. ఆన్లైన్లోనే కీర్తనలు

కరోనా మహమ్మారి దెబ్బకు తల్లడిల్లుతున్న యూరప్ దేశం బ్రిటన్‌లో భారతీయ సమాజాలు పండుగలు, వేడుకలు జరుపుకోవటానికి నానా కష్టాలు పడుతున్నాయి. సిక్కులు ఎంతో వైభవంగా నిర్వహించే పండుగ వైశాఖి ఇవాళే. అయితే, కరోనా భయంతో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించటంతో సిక్కు సమాజం గురుద్వారాలకు వెళ్లకుండా ఎవరి ఇంట్లో వాళ్లు ఉండే ఈ పండుగను జరుపుకున్నారు.

సాధారణంగా వైశాఖి రోజు గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక కీర్తనలు ఆలపించటం ఆచారం. అయితే ఈసారి మాత్రం గురుద్వారాలో జరిగే వేడుకలను వర్చువల్ ప్రసారాల ద్వారా చూసి ఆనందిస్తున్నారు. కీర్తనలు కూడా ఆన్‌లైన్‌లోనే ఆలపించి భక్తిచాటుకుంటున్నారు.


logo