ఆదివారం 31 మే 2020
International - Apr 13, 2020 , 16:42:53

దుబాయ్‌లో చిక్కుల్లో పడిన హైదరాబాద్‌ వాసి

దుబాయ్‌లో చిక్కుల్లో పడిన హైదరాబాద్‌ వాసి

సోషల్ మీడియాలో మతపరమైన వివాదాస్పద పోస్టు పెట్టి మరో భారతీయుడు దుబాయ్లో చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్కు చెందిన నక్క బాలకృష్ణ దుబాయ్లోని మోరో హబ్ డాటా సొల్యూషన్స్ కంపెనీలో ఛీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వివాదాస్పద పోస్టు పెట్టాడు. అది వైరల్ కావటంతో కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సోమవారం ప్రకటించింది. తమ ఉద్యోగులు ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. ఇదేరకమైన ఆరోపణలతో గత గురువారం రాకేష్ బి కిట్టుర్మాత్ అనే వ్యక్తి కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.   


logo