మంగళవారం 26 మే 2020
International - Apr 12, 2020 , 13:24:18

ఆశ్రయంలో ఉంటూనే పిల్లల్నికూడా కన్నాడు

ఆశ్రయంలో ఉంటూనే పిల్లల్నికూడా కన్నాడు

అనేక అగ్రరాజ్యాల రహస్య కుట్రలను ప్రపంచంముందు పెట్టిన సంచలన వికీలీక్స్‌ వ్యవస్తాపకుడు జులియన్‌ అసాంజే గురించి మరో సంచనల వార్త బయటకు వచ్చింది. అమెరికాకు భయపడిన లండన్‌లోని ఈక్వెడార్‌ దౌత్యకార్యాలయంలో చాలాకాలం తలదాచుకున్న ఆయనను ఇటీవలే లండన్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈక్వెడార్‌ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలోనే తన వ్యక్తిగత న్యాయవాది స్టెల్లా మోరిస్‌ ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయినట్లు తాజాగా కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మోరిస్‌ కూడా ధృవీకరించారు. తాము ప్రేమలో ఉన్నామని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. వీరికి రెండేండ్లు, ఏడాది వయసున్న ఇద్దరు బాబులు ఉన్నారు.  


logo