గురువారం 28 మే 2020
International - Apr 12, 2020 , 12:48:26

బంగ్లా మాజీ సైనికాధికారికి ఉరి

బంగ్లా మాజీ సైనికాధికారికి ఉరి

బంగ్లాదేశ్‌ జాతిపిత, బంగబంధు షేక్‌ ముజీబుర్‌రహమాన్‌ హత్యకేసులో మరో సైనిక మాజీ అధికారికి ఆ దేశం శనివారం రాత్రి ఉరిశిక్ష అమలుచేసింది. 1975లో సైన్యం తిరుగుబాటు చేసి ముజీబుర్‌ రెహమాన్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను దారుణంగా కాల్చి చంపింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న మాజీ సైనిక కెప్టెన్‌ అబ్దుల్‌ మాజెద్‌ను ఢాకా కేంద్ర కారాగారంలో శనివారం రాత్రి 12.01గంటలకు ఉరితీసినట్లు జైలు సూపరింటెండెంట్‌ మబ్ముబుల్‌ ఇస్లాం తెలిపారు. దాదాపు 25 ఏండ్లపాటు ఇండియాలో తలదాచుకొని తిరిగి స్వదేశం చేరిన మాజెద్‌ను గత మంగళవారమే ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు   


logo