ఆదివారం 31 మే 2020
International - Apr 12, 2020 , 14:02:52

చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా

చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా

కరోనా మహమ్మారిని విజయవంతంగా నియంత్రించినట్లు ప్రకటించిన చైనాను అది మళ్లీ వణికిస్తున్నది. శనివారం ఒక్కరోజే దేశంలో 99 కొత్త కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉహాన్‌లో కరోనాను పూర్తిగా నియంత్రించిన తర్వాత ఒకరోజులో అత్యధికంగా కేసులు నమోదుకావటం ఇదే మొదటిసారి అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. తాజా కేసులతో ఇటీవల నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1280కి చేరుకున్నాయి. ఈ కేసులన్నీ ఇంపోర్టెడ్‌వేనని ఆరోగ్య కమిషన్‌ తెలిపింది.

కొత్తగా వ్యాధి సోకినవారిలో 481మందిని డిశ్చార్జి చేశామని, 799 మందికి ఇంకా వైద్యం అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వీరితో కలిపి చైనాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,052కు చేరింది. 


logo