సోమవారం 01 జూన్ 2020
International - Apr 11, 2020 , 17:49:46

ఈ పేజీ ధర 69 కోట్లు

ఈ పేజీ ధర 69 కోట్లు

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యూజికల్‌ ట్రూప్‌ బీటిల్స్‌ సభ్యులు వాడిన మ్యూజికల్‌ వస్తువులు, ఇతర జ్ఞాపకాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అందులో ప్రఖ్యాత ‘హే జూడ్‌’ అనే పాట రాతప్రతి మాత్రం ఎవరూ ఊహించని ధర పలికింది. మెక్‌కార్ట్నె రాసిన ఆ పాట రాతప్రతి ఏకంగా 910000 డాలర్లకు వేలంలో అమ్మడుపోయింది. 1968లో లండన్‌లోని ట్రిడెండ్‌ స్టూడియోలో రికార్డింగ్‌కోసం ఆయన ఈ పాటను రాశారు.

బీటిల్స్‌ బృందం విడిపోయి 50 ఏండ్లు అవుతున్న సందర్భంగా కాలిఫోర్నియాకు చెందిన జులియన్స్‌ అనే సంస్థ ఆ ట్రూప్‌నకు సంబంధించిన గిటార్లు, ఇతర అరుదైన వస్తువులను వేలం వేసింది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన ఈ వేలంలో ఈ రాతప్రతి ఊహించినదానికంటే ఐదురెట్లు ఎక్కువ ధరకు అమ్ముడు పోయిందని జులియన్స్‌ సంస్థ ప్రకటించింది.


logo