మంగళవారం 26 మే 2020
International - Apr 11, 2020 , 17:01:11

భారత ప్రభుత్వానికి బ్రిటన్‌ కృతజ్ఞతలు

భారత ప్రభుత్వానికి బ్రిటన్‌ కృతజ్ఞతలు

కరోనా కట్టడిలో ఉపయోగిస్తున్న ప్యారాసెటమాల్‌ మాత్రలను బ్రిటన్‌కు భారత్‌ ఎగుమతి చేస్తున్నది. ఆదివారం నాటికి 30లక్షల ప్యాకెట్ల ప్యారాసెటమాల్‌ మాత్రలు తమదేశానికి అందుతాయని బ్రిటన్‌ విదేశాంగశాఖ ఉపమంత్రి తారిక్‌ అహ్మద్‌ తెలిపారు. అత్యవసర సమయంలో తమకు ఈ మందులు అందజేసినందుకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19వైరస్పై పోరులో భారత్‌, బ్రిటన్‌ కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రత్యేక విమానంలో ఈ ఔషధాలు బ్రిటన్‌ చేరుకోనున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుబడిపోయిన బ్రిటిష్‌ జాతీయులను స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం భారత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.  


logo