బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 15:34:20

టీచర్లు జూమ్ వాడొద్దు.. సింగపూర్ ఆదేశం

టీచర్లు జూమ్ వాడొద్దు.. సింగపూర్ ఆదేశం

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కార్యక్రమాలు పెరుగటంతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ జూమ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వేలమంది కొత్తగా దీనిని వాడటం మొదలుపెట్టారు. అయితే, దీనిద్వారా కొందరు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. దాంతో సింగపూర్‌ ప్రభుత్వం ఈ టూల్‌ను వాడరాదని టీచర్లకు ఆదేశాలు జారీచేసింది.

ఇటీవల హైస్కూల్‌ విద్యార్థులకు ఈ టూల్‌ ద్వారా భూగోళశాస్త్రం పాఠం బోధిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అభ్యంతరకరమైన చిత్రాలను అందులో ప్రదర్శించాడు. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ఈ టూల్‌ను వాడరాదని స్పష్టంచేసింది. కరోనా కారణంగా సింగపూర్‌లో కూడా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో విద్యార్థులకు టీచర్లు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ల ద్వారా ఇంటినుంచే బోధన చేస్తున్నారు.   


logo