బుధవారం 27 మే 2020
International - Apr 11, 2020 , 11:25:12

చమురు ఉత్పత్తి దేశాలకు భారత్ హామీ

చమురు ఉత్పత్తి దేశాలకు భారత్ హామీ

కరోనా సంక్షోభం తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా శక్తి వనరుల వినియోగంలో భారతే అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుందని పెట్రోలియం, సహజవాయుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. జీ 20 దేశాల ఇంధనశాఖ మంత్రుల వర్చువల్‌ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా చమురు డిమాండ్‌ తగ్గి తద్వారా ధరలు పడిపోవటంతో చమురు ఉత్పత్తి దేశాలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి దారులు, వినియోగదారుల మధ్య విన్‌ విన్‌ ఫార్ములాను రూపొందించాల్సి ఉందని అన్నారు.

భారత్‌ తన వ్యూహాత్మక నిల్వలను కొనసాగిస్తుందని ప్రధాన్‌ తెలిపారు. భారత్‌ వద్ద ప్రస్తుతం 5.33 మిలియన్‌ టన్నుల ముడిచమురు వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. విశాఖపట్నం, మంగళూరు, పదూరు వద్ద ఈ క్ష్రేతాలు ఉన్నాయి. ముడిచమురు బ్యారెల్‌కు 30డాలర్ల ధర వద్ద 670 మిలియన్‌ డాలర్లతో చమురు కొనుగోలు చేయాలని ఇటీవలే భారత ప్రభుత్వం నిర్ణయించింది. సౌదీ అరేబియా, యూఏఈల నుంచి మరికొద్ది రోజుల్లో ఈ చమురు దిగుమతి అవుతుంది.   


logo