బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 16:24:51

కరోనాపై మరోసారి జీ20 మీట్

కరోనాపై మరోసారి జీ20 మీట్

కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే అంశంపై చర్చించేందుకు జీ 20దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. మార్చి చివరలో వర్చువల్‌ సమావేశాలు నిర్వహించిన ఈ కూటమి ప్రపంచ మార్కెట్లోకి అత్యవసరంగా 8 బిలియన్‌ డాలర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. తాజాగా కరోనాను అదుపుచేసే క్రమంలో లాక్‌డౌన్లు ప్రకటించటంతో ఆర్థిక వ్యవస్థలకు ఏమేరకు నష్టం జరిగింది? మళ్లీ గాడిలో పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను చర్చించేందుకు జీ 20దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి 31న నిర్వహించిన సమావేశాకు కొనసాగింపుగా ఈ నెల 15న మరోసారి సమావేశాలు జరుగనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాలు ఎంతో కీలకమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధులుగా ఆర్థిక మంత్రి నిర్మళాసీతారామన్, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పాల్గొననున్నారు.                                                              


logo