శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 10, 2020 , 15:39:38

వెయ్యిమంది ఉగ్రవాదులు హతం

వెయ్యిమంది ఉగ్రవాదులు హతం

ఆఫ్రికాదేశం చాద్‌లో సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెయ్యిమంది బొకో హరాం ఉగ్రవాదులను చంపివేశామని ఆ దేశ సైన్యం ప్రకటించింది.  ఈ ఆపరేషన్‌లో 50మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక ప్రతినిధి ఆమెజ్‌ బెర్మడోవా తెలిపారు. మరో 196 మంది సైనికులు గాయపడ్డట్లు వెల్లడించారు. నైజీరియా కేంద్రంగా ఆఫ్రికా దేశాల్లో మారణహోమం సృష్టిస్తున్న బొకోహరాం ఉగ్రవాదులు ఇటీవల చాద్‌ సైనికులపై ఆకస్మికంగా దాడిచేసి దాదాపు 100 మంది సైనికులను చంపిశారు. దాంతో మార్చి 31 చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో సైన్యం ఉగ్రవాదుల వెన్ను విరిచినట్లు సైనిక ప్రతినిధి ప్రకటించారు. సైనిక ఆపరేషన్‌ సుదీర్ఘంగా సాగటంతో మృతుల వివరాలు సేకరించేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. 


logo