శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 10, 2020 , 10:56:41

అమెరికా దవాఖానలకు వైట్హౌస్ హెచ్చరిక

అమెరికా దవాఖానలకు వైట్హౌస్ హెచ్చరిక

అమెరికాలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడ దవాఖాలు మొత్తం ప్రైవేటువే కావటంతో వైద్యం కోసం రోగులు వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులో లేని దవాఖానల్లో వైద్యం పొందుతున్నవారు, ఇన్సూరెన్స్‌ వర్తించని వైద్యుల సేవలు పొందుతున్నవారికి దవాఖానలు బిల్లులతో షాకిస్తున్నాయి. దాంతో అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ దీనిపై తీవ్రంగా స్పందించింది.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన రెండు ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీలోంచి దవాఖానలకు కూడా నిధులు అందుతున్నందున రోగులకు ఆశ్చర్యపర్చే బిల్లులేవీ వారికి వేయరాదని ఆదేశించింది. అమెరికన్లు ఎవరూ వైద్యపరీక్షలు, వైద్యసేవలకు సంబంధించిన బిల్లుల వల్ల ఆందోళన, ఆశ్చర్యపడకుండా చూడటం అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం బాధ్యత అని వైట్‌హౌస్‌ ప్రతినిధి జడ్‌ డీర్‌ స్పష్టంచేశారు. 


logo