శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 08, 2020 , 17:54:09

ఆఫ్గాన్లో తాలిబన్ల ఘాతుకం.. ఏడుగురి హత్య

ఆఫ్గాన్లో తాలిబన్ల ఘాతుకం.. ఏడుగురి హత్య

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు బుధవారం ఘాతుకానికి పాల్పడ్డారు. బాల్ఖ్‌ ప్రావిన్స్‌లో భద్రతా బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న ఏడుగురు సాధారణ పౌరులను అపహరించి బుధవారం కాల్చిచంపారు.  అమెరికాతో శాంతి ఒప్పందంపై గత ఫిబ్రవరిలోనే ఖతార్‌లో తాలిబన్లు సంతకం చేశారు. అయితే ఈ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడుస్తున్నదని ఆరోపిస్తూ మళ్లీ భద్రతాబలగాలు, సామాన్యులపై దాడులు చేస్తున్నది. తాజా దాడికిగల కారణాలు తెలియరాలేదని స్థానిక పోలీస్‌ అధికారి సయిద్‌ అరిఫ్‌ ఇక్బాలీ తెలిపారు. 


logo