శనివారం 06 జూన్ 2020
International - Apr 08, 2020 , 10:57:31

సింగపూర్లో 11 భారతీయులకు కరోనా

సింగపూర్లో 11 భారతీయులకు కరోనా

సింగపూర్‌లో 11 మంది భారతీయులకు తాజాగా కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9మంది పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా 28-44 ఏండ్ల మధ్య వయసువారేనని తెలిపారు. సింగపూర్‌లో మంగళవారం మరో 106 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1481కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఇండ్లల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ జనం గుమికూడరాదని సింగపూర్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.  


logo