శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 08, 2020 , 10:13:29

కరోనా ఆపదలో ఆఫ్రికన్ అమెరికన్లు

కరోనా ఆపదలో ఆఫ్రికన్ అమెరికన్లు

అమెరికాలో కరాళనృత్యం చేస్తున్న కరోనా వేల మందిని బలితీసుకుంటున్నది. అయితే ఈ వ్యాధి సోకుతున్నవారిలో ఆఫ్రికన్‌ అమెరికన్లే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశాధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. తమ వద్ద ఉన్న డాటా ప్రకారం ఆఫ్రికన్‌ అమెరికన్లకు కరోనా ముప్పు అధికంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. ఇతర ప్రజలకంటే వీరికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. అమెరికాలో ఇప్పటివరకు లక్షా 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ఆఫ్రికన్ అమెరికన్లకు అన్నిరకాలుగా సాయం అందిస్తామని తెలిపారు. సహజంగానే వీరికి డయాబెటిక్‌, హైపర్‌టెన్షన్‌, స్తూలకాయం, ఆస్తమా ఎక్కువగా ఉంటాయని, అలాంటి వారికి కరోనా చాలా ప్రమాదకరమని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చుయస్‌ డిసీజ్‌ డైరెక్టర్‌ ఆంటోనీ ఫాసీ అన్నారు.   


logo