గురువారం 04 జూన్ 2020
International - Apr 08, 2020 , 07:58:47

కరోనాపై అమెరికా చైనా మధ్య వార్

కరోనాపై అమెరికా చైనా మధ్య వార్

రోనా మ్మారి అమెరికా, యూరప్ దేశల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో ఆయా దేశాలు రోనా పుట్టినిల్లయిన చైనాపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై అమెరికా చైనాల ధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రాణ ష్టం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజాయితీ, నిబద్ధతపై నీలినీడలు మ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్ల్యూహెచ్వోను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తుండటం, నెల 9 ఐక్యరాజ్యమితి ద్రతామండలిలో రోనాపై చైనాతో అమీ తుమీ తేల్చుకుంటామని ట్రంప్ ప్రటించటంతో రోనా స్య ఇప్పడు క్రమంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడకు చుట్టుకుంటున్నది.

కరోనా అమెరికాను అతలాకుతలం చేయటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాయే కారణమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వైరస్‌ తీవ్రత తెలిసి కూడా తమకు సరైన సూచనలు చేయలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఈ నెల 9న ఐక్యరాజ్యసమితి భధ్రతామండలిలో అనధికారిక చర్చ జరుగనుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ సభ్యదేశాలకు ఈ సంక్షోభంపై వివరించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో చైనాను ఉతికి ఆరేయాలని అమెరికా భావిస్తున్నది.

‘అత్యధిక నిధులు అమెరికా నుంచి పొందుతున్న డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా పనిచేస్తున్నది. అదృష్టవశాత్తూ చైనా కోసం మా సరిహద్దులు తెరిచి ఉంచాలన్న వారి సలహాను నేను ముందుగానే తిరస్కరించారు. ఇలాంటి తప్పుడు సలహా మాకు ఎలా ఇస్తారు’ అని మండిపడ్డారు. అసలు ఈ సమస్య మొత్తం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌తోనే వచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2017 మేలో ఈ సంస్థకు జరిగిన ఎన్నికల్లో అమెరికా బలపర్చిన డేవిడ్‌ నబారోపై చైనా బలపర్చిన టెడ్రో అధనమ్‌ ఘెబ్రియేసుస్‌ గెలుపుపొందారు.

చైనాలోని వుహాన్‌లో కరోనా మొదట వెలుగుచూసింది 2019 నవంబర్‌ 17న.  అయితే దానిని మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో గుర్తించినది 2020 మార్చి 12న. అప్పటికే అది ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. యూరప్‌లో వెయ్యిమందికిపైగా బలితీసుకుంది. దాంతో డబ్లూహెచ్‌వోతోపాటు ఆ సంస్థ డైరెక్టర్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఇనిపిస్తున్నాయి. జపాన్‌ కూడా ఘెబ్రియేసుస్‌ను పదవినుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఆయనను తొలగించేందుకు ఏకంగా ఆన్‌లైన్‌ పోలింగ్‌ కూడా ప్రారంభమైంది.

ఇక ఐరాస భద్రతామండలిలో మరో 24 గంటల్లో జరుగబోయే చర్చకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులోని పది తాత్కాలిక సభ్యదేశాలు భద్రతామండలి అధ్యక్షుడి చర్యలకు మద్దతిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఇప్పుడు డొమెనిక్‌   రిపబ్లిక్‌ ఉన్నది. అయితే ఈ చర్చల్లో అమెరికా వాదన కచ్చితంగా నెగ్గుతుందని చెప్పలేం. ఎందుకంటే ఏదైనా సీరియస్‌ చర్చ మొదలైతే చైనా, రష్యా వీటో చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 


logo