శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 16:00:59

జీ20 దేశాలకు ప్రపంచ ప్రముఖుల పిలుపు

జీ20 దేశాలకు ప్రపంచ ప్రముఖుల పిలుపు

ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనాను పూర్తిగా రూపుమాపేందుకు జీ20 దేశాలే పూనుకోవాలని ప్రపంచంలోని పలువురు మాజీ దేశాధినేతలు, వీఐపీలు, సెలబ్రిటీలు కోరారు. కొన్ని దేశాల్లో కరోనా తగ్గి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రెండోసారి కరోనా ప్రపంచాన్ని నాశనం చేయకండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం 8బిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనాకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తయారుచేయాలని జీ20 దేశాధినేతలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌తోపాటు 165 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. వీరిలో 92 మంది మాజీ దేశాధినేతలు, కొందరు ప్రస్తుత అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. పేద దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కనీసం 150 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని లేఖలో పేర్కొన్నారు. 


logo