మంగళవారం 26 మే 2020
International - Apr 07, 2020 , 13:39:00

రష్యాలో ఒక్కరోజే వెయ్యి కరోనా కేసులు

రష్యాలో ఒక్కరోజే వెయ్యి కరోనా కేసులు

రష్యాలో నిన్నమొన్నటివరకు పెద్దగా కనిపించని కరోనా తాజాగా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే  వెయ్యి కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7494కు చేరింది. రష్యాలో ఇప్పటివరకు కరోనా కారనంగా 58మంది మరణించారు.  వైరస్‌ రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో రష్యా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది.  అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించటంతోపాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.  


logo