శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 06:26:37

ముఖ కవచాల తయారు చేయనున్న ఆపిల్

 ముఖ కవచాల తయారు చేయనున్న ఆపిల్


ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాలకు రక్షణ కల్పించే కవచాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. ఈ ఫేస్ షీల్డ్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఆపిల్ సంస్థ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది. ‘ది క్యూపర్టినో’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తున్నది. వారానికి పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో వినియోగించనున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ముఖ కవచాలు కరోనా చికిత్సలో పాలుపంచుకునే వైద్యసిబ్బందికి విశేషంగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.


logo