గురువారం 28 మే 2020
International - Apr 06, 2020 , 10:26:00

టోక్యోలో క‌రోనా ఎమ‌ర్జెన్సీ!

టోక్యోలో క‌రోనా ఎమ‌ర్జెన్సీ!

జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో క‌రోనా కేసుల సంఖ్య 1000 దాట‌డంతో న‌గ‌రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప్ర‌క‌టించేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ విష‌యంపై అధికారుల‌తో ప్ర‌ధాని షింజో అబే చ‌ర్చించార‌ని, సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం నుంచి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి అందుబాటులోకి రావ‌చ్చ‌ని స్తానిక మీడియా వెల్ల‌డించింది. దేశంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న టోక్యో ఇత‌ర న‌గ‌రాల్లో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున వెంట‌నే దేశవ్యాప్తంగా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప్ర‌క‌టించాల‌ని జ‌పాన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ గ‌త‌వార‌మే సూచించింది. స్థానిక టీవీ చాన‌ల్ జేఎన్ఎన్ నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో కూడా 80శాతం మంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించాల‌ని కోరారు. 

టోక్యోలో ఆదివారం ఒక్క‌రోజే 143 కొత్త క‌రోనా కేసులు వెలుగుచూశాయి. గ‌త వారం నుంచి న‌గ‌రంలో రోజూ 100కు త‌క్కువ కాకుండా కొత్త కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితివైపు మొగ్గుచూపుతున్న‌ది. జ‌పాన్ మొత్తంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కేసులు 3000 దాటాయి. 


logo