శనివారం 06 జూన్ 2020
International - Apr 06, 2020 , 09:58:21

క‌రోనాను గెలుస్తాం: బ‌్రిట‌న్ రాణి సందేశం

క‌రోనాను గెలుస్తాం: బ‌్రిట‌న్ రాణి సందేశం

క‌రోనా గుప్పిట చిక్కి విల‌విల‌లాడుతున్న బ్ర‌టిన్ ప్ర‌జ‌ల‌కు ఆ దేశ రాణి ఎలిజ‌బెత్ ధైర్యం చెప్పారు. క‌రోనా భ‌యంతో విండ్స‌ర్ కోట‌లో సెల్ఫ్ క్వారంటైమ్‌లో ఉన్న ఆమె దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి టెలివిజ‌న్లో ప్ర‌సంగించారు. క‌రోనా బారిన‌ప‌డి హాస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మ‌న‌మంతా క‌లిసిక‌ట్టుగా ఉంటే క‌రోనాను జ‌యించ‌గ‌లం అని స్ప‌ష్టంచేశారు. ఆమె 67 సంవ‌త్స‌రాల ప‌రిపాల‌న‌లో టెలివిజ‌న్‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌టం ఇది ఐదోసారి మాత్ర‌మే. 


బ్రిట‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 5000 చేరుకుంది. సోమ‌వారం ఒక్క‌రోజే 621 మంది మ‌ర‌ణించారు. క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య 50000 చేరింది. గ‌త ప‌దిరోజులుగా క్వారంటైమ్‌లో ఉన్న ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌కు వ్యాధి త‌గ్గ‌క‌పోవ‌టంతో ఆదివారం హాస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుంటార‌ని, తాము మ‌ళ్లీ క‌లుస్తామ‌ని రాణి అన్నారు. నిద్రాహారాలు మాని రోగుల‌కు సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బంది, ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందిని రాణి అభినందించారు. 


logo