బుధవారం 03 జూన్ 2020
International - Apr 04, 2020 , 00:02:06

జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న‌ క్వీన్ ఎలిజబెత్

జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న‌ క్వీన్ ఎలిజబెత్

లండ‌న్‌: బ‌్రిట‌న్ ను కరోనా వైరస్ మహమ్మారి వేధిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ నెల 5పన‌ ప్రసంగించబోతున్నారు. రాజ కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ ఆదివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు యునైటెడ్ కింగ్‌డమ్, కామన్వెల్త్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపింది. కాగా ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప్రస్తుతం విండ్సర్ కేజిల్‌లో సెమీ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆమె వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 10 లక్షలకు పైగా నమోదయ్యాయి, వీరిలో 54 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌ను కూడా ఈ వైరస్ తీవ్రంగా వేధిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బ్రిటన్‌‌లో ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 34 వేలు దాటింది. అటు మ‌ర‌ణాల సంఖ్య మూడు వేల‌కు చేరువైంది. ఇక బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని గత వారం నిర్థరణ కావడంతో, ఆయన సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు.


logo