శనివారం 30 మే 2020
International - Apr 03, 2020 , 15:32:46

చైనా సంతలతోనే ప్రపంచానికి తిప్పలు

చైనా సంతలతోనే ప్రపంచానికి తిప్పలు

చైనాలోని పచ్చి మాంసం, ఇతర వస్తువులు విక్రయించే సంతలతో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ కూడా వుహాన్‌ నగరంలో ఉన్న సముద్ర ఉత్పత్తుల సంతనుంచే వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా తడి సంతలపై ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్‌వో దృష్టి సారించాలని మోరిసన్‌ సూచించారు. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ఇప్పడు ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నదని, లక్షల కోట్ల మేర వ్యాపారాలు నష్టపోయాయని అసహనం వ్యక్తంచేశారు. ‘మనందరికీ తెలుసు చైనాలోని తడి సంతలతో ఎన్ని సమస్యలు వస్తున్నాయో. ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా ఈ సంతల విషయంలో అంతర్జాతీయ సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.  


logo