సోమవారం 01 జూన్ 2020
International - Apr 03, 2020 , 13:43:26

చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అని పేరు మార్చుకోండి.. జపాన్

చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అని పేరు మార్చుకోండి.. జపాన్

కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని జపాన్‌ ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌వో తన పేరును చైనా హెల్త్‌ ఆర్గనైజేషన్‌గా మార్చుకోవాలని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రమాదాన్ని అంచనా వేయటంలో డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసుస్‌ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. శుక్రవారం జపాన్‌ చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన ఆయన గెబ్రెయేసుస్‌ను పదవి నుంచి తొలగించేందుకు చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీలో పిటిషన్లు నడుస్తుందన్నదని అన్నారు. ఈ పిటిషన్‌పై కనీసం 5లక్ష మంది సంతకాలు చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భావించాల్సి వస్తుందని, ఇప్పటికే దానిపై 7లక్షల మంది సంతకాలు చేశారని తెలిపారు. సొంతంగా ఎలాంటి విచారణ జరుపకుండానే చైనాలో కరోనా వ్యాధిగ్రస్తులు, మృతుల గురించి ఆ దేశం చెప్పిన లెక్కలను ఎలా ధృవీకరిస్తుందని ప్రశ్నించారు.   


logo