బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 09:31:14

కరోనా మహావిపత్తే

కరోనా మహావిపత్తే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సాధారణమైన ఆరోగ్య సమస్య కాదని ఇది మహా విపత్తేనని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ ఆంటోనీ ఫాసీ అన్నారు. 1984 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న ఆయన తాను ఆరుగురు అధ్యక్షుల వద్ద పనిచేశానని కానీ ఇలాంటి విపత్తును ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.  ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు ప్రకటించటం, ప్రజలను బలవంతంగా ఇండ్లకే పరిమితం చేయటంతో ముందుముందు ఈ పరిణామాలు దారుణమైన ఫలితాలను ఇస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్లు దీర్ఘకాలం కొనసాగితే ఆర్థికంగా, సామాజికంగా అసాధారణ అలజడులు చెలరేగుతాయని విశ్లేషించారు. కోట్లమందికి వైద్యం, పౌష్టికాహారం, కనీస ఆహారం కూడా అందని పరిస్థితులు ఏర్పడుతాయని ఆకలితో మాడిపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. 


logo