గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 09:18:35

రష్యా మంచి ఆఫర్ ఇచ్చింది.. ట్రంప్

రష్యా మంచి ఆఫర్ ఇచ్చింది.. ట్రంప్

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికాకు అత్యవసర వైద్యపరికరాలు అందించేందుకు రష్యా ముందుకు రావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతోషం వ్యక్తంచేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. అత్యంత నాణ్యమైన వెంటిలేటర్లు ఇతర వైద్యపరికరాలు తమకు అనుకూలమైన ధరకు అమ్మేందుకు పుతిన్‌ ఒప్పుకున్నారని తెలిపారు. ఈ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా రష్యా ఏమైన ప్రాపగాండా చేస్తున్నదా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. అతిత్వరలో రష్యా నుంచి వాయుమార్గాన రష్యా నుంచి వైద్య పరికరాలు వస్తాయని వైట్‌ హౌస్‌ అధికారి ఒకరు తెలిపారు.   


logo