సోమవారం 01 జూన్ 2020
International - Apr 03, 2020 , 09:06:21

ఫేస్మాస్క్ పూర్తి రక్షణ కాదు

ఫేస్మాస్క్ పూర్తి రక్షణ కాదు

కరోనా నుంచి తప్పించుకొనేందుకు ముఖానికి మాస్క్‌ మాత్రమే ధరిస్తే సరిపోదని కరోనాపై అమెరికా వైట్‌హౌస్‌ టాస్కఫోర్స్‌ ప్రతినిధి డెబోరా బ్రిక్స్‌ హెచ్చరించారు. కచ్చితంగా సమాజిక దూరం పాటిస్తేనే పూర్తి రక్షణ పొందవచ్చని సూచించారు. ‘గుర్తుంచుకోండి. చాలామంది భావిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ఫేస్‌మాస్క్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు’ అని స్పష్టంచేశారు. రాబోయే వారంపాటు కరోనానుంచి తప్పించుకొనేందుకు ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. అమెరికాలో ఇప్పటికే కరోనా బాధితులు రెండున్నర లక్షలకు చేరుకున్నారు. 5800 మంది మరణించారు.   


logo