శనివారం 06 జూన్ 2020
International - Apr 03, 2020 , 08:53:23

ఉగ్రవాదంపై పాక్ బుద్ధి మారనేలేదు.. అమెరికా

ఉగ్రవాదంపై పాక్ బుద్ధి మారనేలేదు.. అమెరికా

అమెరికన్‌ జర్నలిస్టు డేనియల్‌ పెర్ల్‌ను దారుణంగా హత్యచేసిన ఉగ్రవాది అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌కు గతంలో విధించిన మరణశిక్షను పాకిస్తాన్‌ కోర్టు తగ్గించటంపై అమెరికా మండిపడింది. ఈ చర్యతో ఉగ్రవాద బాధితులను పాకిస్తాన్‌ అగౌరవపర్చిందని ఆక్షేపించింది. గురువారం సింధ్‌ కోర్టు సయీద్‌ షేక్‌ మరణశిక్షను ఏడేండ్ల సాధారణ శిక్షగా మార్చింది. షేక్‌ గత 18 ఏండ్లుగా జైల్లో ఉన్నాడు.  ఈ ఉగ్రవాదికి మరణశిక్ష అమలుచేయకుండా ఇంతకాలం కాలయాపన చేసి, ఇప్పుడు శిక్షను పూర్తిగా తగ్గించటం సరికాదని అమెరికా విదేశాంగశాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ శుక్రవారం విమర్శించారు. 


logo