మంగళవారం 26 మే 2020
International - Apr 03, 2020 , 08:31:44

చైనా లెక్కలు నమ్మశక్యంగా లేవు.. హేలీ

చైనా లెక్కలు నమ్మశక్యంగా లేవు.. హేలీ

కరోనా మృతుల సంఖ్య విషయంలో బయటి ప్రపంచానికి చైనా చెప్తున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని ఇండియన్‌ అమెరికన్‌ రాజకీయ నేత నిక్కీ హేలీ అనుమానం వ్యక్తంచేశారు చైనా లెక్కలను నమ్మవద్దని అమెరికా ప్రభుత్వానికి ఆ దేశ గూఢచార సంస్థ సీఐఏ సూచించిన నేపథ్యంలో హేలీ కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. బీజింగ్‌ చూపుతున్న లెక్కలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తమ దేశంలో 82000 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని, 3300మంది మరణించారని చైనా ప్రకటించింది. చైనాలో కరోనా బయటపడిన రెండు నెలల తర్వాత అమెరికాలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి అక్కడ ఇప్పటికే 240000 మందికి సోకింది. 5800 మంది మరణించారు. యూరప్‌లో కూడా కేసుల సంఖ్య లక్షల్లోనే ఉంది. కరోనా విషయంలో ప్రపంచానికి సాయం చేయాల్సిందిపోయి చైనా తన ప్రతిష్టను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నదని హేలీ ఆరోపించారు.  


logo