గురువారం 04 జూన్ 2020
International - Apr 01, 2020 , 17:46:00

పాకిస్థాన్పై యూఎస్సీఐఆర్ఎఫ్ ఆగ్రహం

పాకిస్థాన్పై యూఎస్సీఐఆర్ఎఫ్ ఆగ్రహం

పాకిస్థాన్‌లో మైనారిటీలపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్‌ తీవ్ర విమర్శలు చేసింది. పాక్‌లోని బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టా నగరాన్ని పూర్తిగా దిగ్బంధించిన ప్రభుత్వం అక్కడి షియత్‌ హజారా సంప్రదాయ జాతివారికి వైద్యం సదుపాయాలు ఏర్పాటుచేయకుండా వదిలేసిందని విమర్శించింది. ఇప్పటికే తమ సొంత ప్రాంతాలలో బతకలేక వలసబాట పడుతున్న హజారా జాతివారిని కరోనా నేపథ్యంలో ప్రభుత్వం బలిపశువులను చేస్తున్నదని ఆక్షేపించింది. హజారా ప్రజలు నివసించే ప్రాంతాలకు ఇతర ప్రాంత అధికారులు వెల్లవద్దని పాక్‌ ప్రభుత్వం ఆదేశించిందని, అంతేకాకుండా ఆ ప్రాంత అధికారులను కూడా ఇండ్లలోనే ఉండాలని సూచించటం ఆందోళనకరమని పేర్కొంది.  


logo