బుధవారం 03 జూన్ 2020
International - Apr 01, 2020 , 16:44:20

హజ్ యాత్రలు వాయిదా వేసుకోండి

హజ్ యాత్రలు వాయిదా వేసుకోండి

ముస్లింలకు పవిత్రమైన హజ్‌ యాత్రలు వాయిదా వేసుకోవాలని ప్రపంచ వ్యాప్త ముస్లింలకు సౌదీ అరేబియా సూచించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హజ్‌ యాత్రకు రాకపోవటమే మంచిదని సౌదీ హజ్‌ అండ్‌ ఉమ్రా మంత్రి ముహమ్మత్‌ సలా బిన్‌ తాహెర్‌ బెంటెన్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. యాత్రపై తాము మళ్లీ ప్రకటన చేసేవరకు ముస్లింలు ఎవరూ యాత్రకు సంబంధించి ట్రావెల్‌ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కోరారు. సౌదీలోని పవిత్రమైన మక్క, మదీనా నగరాలలోకి విదేశీయులు రాకుండా ఆ దేశం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిషేధించింది.  కరోనా కారణంగా సౌదీలో ఇప్పటివరకు పది మంది మరణించారు. 1500 కరోనా కేసులు బయటపడ్డాయి. 


logo