బుధవారం 03 జూన్ 2020
International - Apr 01, 2020 , 16:20:10

అమెరికా మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది

అమెరికా మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంపై అమెరికా అన్యాయంగా విధించిన ఆంక్షలను ఎత్తివేసి క్షమాపన చెప్పాల్సి ఉండేదని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీ అన్నారు. అమెరికా తప్పును సరిదిద్దుకొనే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుందని బుధవారం జరిగిన ఆ దేశ క్యాబినెట్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇరాన్‌ కూడా కరోనాతో తీవ్రంగా ప్రభావితమవుతున్నది. ఈ వ్యాధితో 2898 మంది మరణించారు. దాంతో వ్యాధిపై పోరాడేందుకు ఇరాన్‌పై ఆంక్షలను కొంచెం సడలించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో మంగళవారం వ్యఖ్యానించారు. దాంతో ఇరాన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ ‘క్షమాపణ చెప్పందుకు అమెరికన్లకు గొప్ప అవకాశం లభించింది. అన్యాయమైన ఆంక్షలను ఎత్తేయాల్సి ఉండె. వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇరాన్‌కు తాము వ్యతిరేకం కాదని నిరూపించుకొని ఉంటే బాగుండేది’ అని రొహానీ వ్యాఖ్యానించారు.  


logo