ఆదివారం 31 మే 2020
International - Apr 01, 2020 , 14:36:26

ట్రంప్‌కు అమెరికన్ టెకీల లేఖ

ట్రంప్‌కు అమెరికన్ టెకీల లేఖ

కరోనా సంక్షోభంతో రోజురోజుకూ అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్‌ 1బి వీసాలతోపాటు హెచ్‌ 2బి వీసాలు కూడా ఈ ఏడాది ఇవ్వరాదని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అమెరికన్‌ టెకీలు లేఖ రాశారు. వ్యాపారాలు పూర్తిగా స్తంభించటంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో ఏప్రిల్‌ చివరి నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 70లక్షలకు చేరుకుంటుందని అంచనా. దాంతో కొత్తవారు దేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అమెరికా టెకీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌ అనే స్వచ్చంద సంస్థ తన లేఖలో పేర్కొంది.

కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉండటంలో ఈ ఏడాది హెచ్‌ 1బి, హెచ్‌ 2బి వీసా ప్రోగ్రాంను సస్పెండ్‌ చేయాలని అధ్యక్షుడిని కోరాం. అధ్యక్షుడితోపాటు ఆయన అధికారయంత్రాంగానికి, కాంగ్రెస్‌ సభ్యులకు కూడా లేఖలు పంపాం అని ఆ సంస్థ వెల్లడించింది. హెచ్‌ 2బీ వీసాలను వ్యవసాయ కార్మికులకు ఎక్కువగా జారీచేస్తారు. అమెరికా కంపెనీలు వ్యవసాయ కార్మికులను లాటిన్‌ అమెరికా దేశాల నుంచి ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకుంటుంటాయి. 


logo