శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 01, 2020 , 12:11:27

కరోనాతో గీతా రామ్జీ మృతి

కరోనాతో గీతా రామ్జీ మృతి

ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టు గీతా రామ్‌జీని కరోనా మహమ్మారి బలితీసుకుంది. భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికావాసి అయిన ఆమె వైరాలజిస్టుగా, హెచ్‌ఐవీకి మందు కనుగొనేందుకు జరుగుతున్న పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు. దక్షిణాఫ్రికా మెడికల్‌ రిసెర్చ్‌ కౌన్సిలో హెచ్‌ఐవీ పరిశోధనల విభాగానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఆమె లండన్‌ నుంచి జొహెన్నెస్‌బర్గ్‌ వెళ్లారు. గీత ఆకస్మిక మృతిపై ఎస్‌ఏఎంఆర్‌సీ సీఈవో గ్లెండా గ్రే తీవ్ర సంతాపం తెలిపారు. 2018లో యూరోపియన్‌ డెవలప్‌మెంట్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పార్టరన్‌షిప్‌ నుంచి ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. 


logo