బుధవారం 03 జూన్ 2020
International - Apr 01, 2020 , 09:00:17

2 వారాల్లో అత్య‌ధిక మ‌ర‌ణాలు : డోనాల్డ్ ట్రంప్‌

2 వారాల్లో అత్య‌ధిక మ‌ర‌ణాలు :  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల సుమారు ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల 40 వేల వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌వించ‌వ‌చ్చు అని ఆ దేశ వైద్యాధికారులు అంచ‌నా వేస్తున్నారు. రానున్న కొన్ని వారాల్లో ఈ మ‌ర‌ణాల సంఖ్య న‌మోదు అవుతుంద‌న్నారు.  మ‌రోవైపు దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా దేశ ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు.  ప్ర‌తి పౌరుడు తాము ఇచ్చిన గైడ్‌లైన్స్ ఫాలోకావాల‌న్నారు. అమెరిక‌న్ల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య ఎదురైంద‌ని,  రానున్న రెండు వారాల్లో వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయేవారి సంఖ్య అత్య‌ధికంగా ఉంటుంద‌న్నారు. ఇది చాలా చాలా బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. కానీ అంద‌రూ ఆ ప‌రిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాల‌న్నారు.

వైట్‌హౌజ్ అధికార‌లు కొత్త డేటాను ప్ర‌జెంట్ చేశారు.  కోవిడ్19 వ‌ల్ల రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌నం చ‌నిపోయే ప్ర‌మాదం ఉంద‌నివార‌న్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో 4వేల మంది మ‌ర‌ణించారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌ర‌ణాల రేటు ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంద‌ని డెమోరా బిక్స్ తెలిపారు.  ఎంత‌లేద‌న్నా.. ల‌క్ష మంది మ‌ర‌ణించ‌డం ఖాయ‌మ‌ని యూఎస్ ఇన్‌ఫెక్షియ‌స్ డీసీజ్ చీఫ్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు ప్రిపేరై ఉండాల‌న్నారు.  చాలా మంది అమెరిక‌న్లు ఈ వైర‌స్‌ను ఫ్లూగా భావిస్తున్నార‌ని, కానీ ఇది ఫ్లూ కాద‌ని ట్రంప్ తెలిపారు.logo