గురువారం 04 జూన్ 2020
International - Mar 31, 2020 , 21:48:41

థాయ్ కింగా మజాకా…సెల్ఫ్‌క్వారంటైన్‌లోనూ విలాసాలు

థాయ్ కింగా మజాకా…సెల్ఫ్‌క్వారంటైన్‌లోనూ విలాసాలు

ఆడంబరానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జనమంతా చెప్పుకొనే థాయ్‌లాండ్‌ రాజు మహా విజిరలోంగ్‌కోర్న్‌ కరోనా మహమ్మారి కోరలు చాచిన ఈ సమయంలోనూ తన దారి మార్చుకోలేదు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన కరోనా తన దరిచేరకుండా ఏకాంతంగా గడపాలనుకున్నారు. ఎంతైనా రాజు కదా తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలనుకొన్నాడో ఏమో ఏకంగా ఓ హోటల్‌ మొత్తం అద్దెకు తీసేసుకున్నారు. బవేరియాలోని గ్రాండ్‌ హోటల్‌ సనెన్‌బిచ్‌ను మొత్తం తనకోసం బుక్‌చేసుకున్నారు. ఆయనతోపాటు హోటల్లో తన ఉంపుగత్తెలు 20 మంది వారికి సేవలు చేసేందుకు మరికొందరు పనివాళ్లు మాత్రమే ఇప్పుడు హోటల్లో ఉన్నారని జర్మనీ పత్రిక బిల్డ్‌ రిపోర్ట్‌ చేసింది.

సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నంతకాలం తనకు సేవలు చేసేందుకు భారీ సంఖ్యలో సేవకులను తెచ్చుకోలని కూడా అనుకున్నారట. కానీ వారిలో ఎవరికైనా కరోనా ఉందేమోన్న అనుమానంతో జర్మనీ ప్రభుత్వం సేవకుల్లో 119 మందిని ఇంటికి పంపేసిందట. కరోనాతో అన్నిదేశాల మాదిరిగానే థాయ్‌లాండ్‌ ప్రజలు కూడా నానా కష్టాలూ పడుతున్నారు. ఈ కష్టసమయంలో తమకు ధైర్యం చెపుతారేమోనని అనుకున్నామని, రాజు యథాప్రకారం దేశం వదిలి వెళ్లిపోయి తన ఆడంబర జీవితాన్ని కొనసాగిస్తున్నారని థాయ్‌ ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మాకు అసలు రాజు ఎందుకంటూ చాలామంది సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు.  


logo