ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 16:20:21

కేంద్రానికి విజయ్‌మాల్యా వినతి

 కేంద్రానికి విజయ్‌మాల్యా  వినతి

దేశంలోని బ్యాంకులకు వేలకోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా మరోసారి తాను తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరమైన ప్రస్తుత తరుణంలో గతంలో తాను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న అప్పు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం ప్రకటించారు. కింగ్‌ఫిషర్‌ కంపెనీకోసం నేను తీసుకున్న రుణాన్ని 100శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి తెలుపుతున్న. కానీ రుణాలు తిరిగి తీసుకొనేందుకు బ్యాంకులు సిద్ధంగాలేవు. నా ఆస్తులను సీజ్‌చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా వాటిని విడుదల చేయనంటున్నది. ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉన్నందున ఇప్పుడైనా నా వినతిని పరిగణనలోకి తీసుకోవాలని భారత ఆర్థిక మంత్రిని కోరుతున్న అని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం వెనుకాముందు ఆలోచించకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిందని, దాంతో తన కంపెనీలన్నీ బలవంతంగా మూసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 


logo