ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 12:20:51

ఇరాన్‌పై ఆంక్షలు మరింత కఠినం

ఇరాన్‌పై ఆంక్షలు మరింత కఠినం

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు అమెరికా గతంలో విధించిన తన ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. బరాక్‌ ఒబామా హయాంలో పశ్చిమదేశాలకు, ఇరాన్‌కు మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మళ్లీ తన అణు కార్యక్రమం చేపట్టకుండా ఆ దేశంపై గతంలో అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా వాటిని మరింత కఠినతరం చేస్తూ మరో 60 రోజులకు పొడగించింది. ‘ఇరాన్‌లో అణు కార్యక్రమాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ ఆంక్షలు ఏ సమయంలోనైనా మరింత కఠినం కావచ్చు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు తయారు చేయనివ్వం అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఓర్టాగస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  


logo