సోమవారం 25 మే 2020
International - Mar 30, 2020 , 17:35:16

ఆస్ర్టేలియా ప్రధాని భారీ ప్యాకేజీ

ఆస్ర్టేలియా ప్రధాని భారీ ప్యాకేజీ

ఆస్ర్టేలియాలో కోవిడ్‌-19 కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ సోమవారం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. వ్యాపారాలు, ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు 130 బిలియన్‌ ఆస్ర్టేలియన్‌ డాలర్లను కేటాయించినట్లు వెల్లడించారు. దేశంలోని 60లక్షల మంది ఉద్యోగులకు ప్రతి రెండువారాలకు 1500 డాలర్ల వేతన సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దాంతో భారాన్ని తగ్గించుకొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నాయి. ఆ పరిస్థితులు తెలెత్తకుండా, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారంతా అవే ఉద్యోగాల్లో కొనసాగించే చర్యలు తీసుకున్నట్లు మోరిసన్‌ తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగులందరికీ ప్రతి రెండు వారాలకు 1500 డాలర్ల వేతన సబ్సిడీ ఇస్తామని, అంత మొత్తం ఉద్యోగికి సంస్థ ఇచ్చే వేతనం నుంచి మినహాయించుంటాయని వెల్లడించారు. ప్రజలు తమకు అత్యవసరమైతేనే ఇండ్లనుంచి బయటకు రావాలని సూచించారు.    


logo