సోమవారం 25 మే 2020
International - Mar 28, 2020 , 15:24:58

కరోనా ఎఫెక్ట్.. చైనాపై చీదరింపు

కరోనా ఎఫెక్ట్.. చైనాపై చీదరింపు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ జనాల ముందు చైనా తలదించుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యాధి చైనా నుంచే వ్యాపించటంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల ప్రజలు చైనా అంటే చీదరించుకుంటున్నారని పలు రిపోర్టులు వెలువడుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్లో అయితే చైనాను అసహ్యించుకుంటూ పోస్టులు పెడుతున్నవారి సంఖ్య ఏకంగా 900 శాతం పెరిగిందని ట్విటర్‌లో ట్రెండ్ అయిన హాష్‌ట్యాగ్‌ల ఆధారంగా లైట్ అనే సోషల్ మీడియా విశ్లేషణ సంస్థ తేల్చింది. 

ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ బయటపడిన తర్వాత చైనాతోపాటు ఆసియా పౌరులపై పశ్చిమ దేశాల్లో జాతి వివక్ష వ్యాఖ్యలు పెరిగిపోయాయి. వేలాది వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా గ్రూపులు, వీడియోలు, చిత్రాలు, ఆడియోలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు లైట్ సంస్థ వెల్లడించింది. ప్రజల్లో ఈ పెడదోరణిపై అమెరికాలాంటి దేశాల్లో హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కోవిడ్-19 బయటపడిన తర్వాత ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్లపై అభ్యంతరకరమైన పోస్టులు పెరిగిపోయాయి.


logo