గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 16:11:46

జీ 20.. ఈసారి వ‌ర్చువ‌ల్ మీటింగ్‌

జీ 20.. ఈసారి వ‌ర్చువ‌ల్ మీటింగ్‌

క‌రోనా దెబ్బకు అంత‌ర్జాతీయ స‌మావేశాలు కూడా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. ఈ నెల 26న ఔదీలో జ‌ర‌గాల్సిన జీ 20 దేశాధినేతల స‌మావేశం క‌రోనా కార‌ణంగా వ‌ర్చువ‌ల్ స‌మావేశంగా మారిపోయింది. ఈసారి స‌మావేశాల‌కు సౌదీ రాజు స‌ల్మాన్ బిన్ అజీజ్ అల్ సౌద్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాల‌కు జీ 20 స‌భ్య‌దేశాధినేత‌లంతా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌ర‌వుతారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా ఈ స‌మావేశాల్లో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొన‌నున్నారు. 

ఈసారి జీ 20 స‌మావేశాల‌కు స్పెయిన్‌, జోర్డాన్‌, సింగ‌పూర్‌, స్వ‌ట్జ‌ర్లాండ్ దేశాలు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి. ఈ దేశాల‌తోపాటు ఐక్య‌రాజ్య‌స‌మితి, ప్ర‌పంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ‌, ప్ర‌పంచ వాణిజ్యం సంస్థ‌, ప్రపంచ ఆహార‌, వ్య‌వ‌సాయ సంస్థ ఐఎంఎఫ్‌, ఓఈసీడీ త‌దిత‌ర సంస్థ‌లు స‌మావేశాల్లో భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌ని సౌదీ అధికారులు బుధ‌వారం తెలిపారు. ఈ నెల 15 భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సార్క్ స‌మావేశాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. ఆయ‌న‌కు జీ 20 వీడియో స‌మావేశం రెండ‌వ‌ది.


logo
>>>>>>