గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 11:44:00

కురిళ్ లో భూకంపం: సునామీ హెచ్చ‌రిక‌లు

కురిళ్ లో భూకంపం: సునామీ హెచ్చ‌రిక‌లు

ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని కురిళ్ ద్వీపాల స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం భారీ భూకంపం సంభ‌వించింది. దాంతో అమెరికా భూభౌతిక విజ్ఞాన‌కేంద్రం సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.8గా న‌మోద‌య్యింద‌ని అమెరికా నేష‌న‌ల్ ఓషియానిక్‌, అట్మాస్ఫియ‌రిక్ అడ్మినిస్ర్టేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భూకంప కేంద్రం కురిళ్‌లోని సెవెరో ప‌ట్ట‌ణానికి ఆగ్నేయ దిశ‌లో 218 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని పేర్కొంది. దీని కార‌ణంగా విధ్వంస‌క‌ర‌మైన సునామీ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని, అది హ‌వాయ్, మిడ్‌వే, ఉత్త‌ర మెరియ‌నాస్‌, వేక్ దీవుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించింది. జ‌పాన్‌, ర‌ష్కా తీరాలకు కూడా న‌ష్టం క‌లుగ‌వ‌చ్చ‌ని తెలిపింది. సునామీ కార‌ణంగా అల‌లు సాధార‌ణం కంటే 0.3 మీట‌ర్ల ఎత్తుకు ఎగిసిప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అయితే, జ‌పాన్ సునామీ హెచ్చ‌రిక‌ల కేంద్రం మాత్రం పెద్ద ప్ర‌మాద‌మేమీ లేద‌ని తెలిపింది. 


logo
>>>>>>