శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 16:42:12

1255 వెంటిలేట‌ర్లు విరాళం.. ఎల‌న్ మ‌స్క్ దాతృత్వం

 1255 వెంటిలేట‌ర్లు విరాళం.. ఎల‌న్ మ‌స్క్ దాతృత్వం

అమెరిక‌న్ కుబేరుడు, టెక్ మొఘ‌ల్‌గా పేరుపొందిన ఎల‌న్ మ‌స్క్ మ‌రోసారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. చైనాలో క‌రోనా  రోగుల‌కు చికిత్స అందించేందుకు అత్య‌వస‌ర‌మైన వెంటిలేట‌ర్ల కొర‌త ఏర్ప‌డింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో వాటిని ఉచితంగా అంద‌జేసేందుకు మ‌స్క్ ముందుకొచ్చారు. చైనాలో కొర‌త ఏర్ప‌డింది. అందువ‌ల్ల 1255 ఎఫ్‌డీఏ నిర్దారిత రెస్‌మెడ్‌, ఫిలిప్స్‌, మెడ్‌ట్రానిక్ వెంటిలేట‌ర్లు విమానంలో పంపుతున్నాను. మీకు ఉచితంగా ఇంకేమైనా వెంటిలేట‌ర్లు కావాలంటే నాకు స‌మాచారం ఇవ్వండి అని టెల్సా కంపెనీ చైనా టీంను ఉద్దేశించి ట్వీట్ చేశారు మ‌స్క్. ఇటీవ‌లే ఆయ‌న అమెరికాలోని ప‌లు ద‌వాఖాన‌లు, యూనివ‌ర్సిటీల‌కు దాదాపు 250,000 ఎన్‌-96 మాస్కుల‌ను కూడా అంద‌జేశారు. లాస్ ఏంజెల్స్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ఒక ట్ర‌క్కునిండా ఎన్‌-95 మాస్క్‌లు అంద‌జేశారు.  logo