మంగళవారం 31 మార్చి 2020
International - Mar 24, 2020 , 13:37:15

అమెరికా చైనా మీడియా లొల్లి

అమెరికా చైనా మీడియా లొల్లి

చైనాలో ప‌నిచేస్తున్న అమెరికా మీడియా ప్ర‌తినిధుల గుర్తింపును చైనా ర‌ద్దు చేయ‌టంపై అమెరికా మీడియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరింది. చైనాలో అమెరికా న్యూస్ పేప‌ర్లు వాల్‌స్ర్టీట్ జ‌ర్న‌ల్‌, వాషింగ్‌ట‌న్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ త‌ర‌ఫున ప‌నిచేస్తున్న అమెరికా  జ‌ర్న‌లిస్టులు త‌మ దేశం విడిచి వెళ్లాల‌ని ఆ దేశం ఈ నెల 18న ఆదేశించింది. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఉన్న ఆయా జ‌ర్న‌లిస్టుల గుర్తింపును కూడా ర‌ద్దు చేసింది. దీంతో అమెరికా మీడియా యూనియ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌పంచం మొత్తం పోరాటం చేస్తున్న ఈ స‌మ‌యంలో చైనా నిర్ణ‌యం హేతుబ‌ద్ధం కాద‌ని, ఆ నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని మంగ‌ళ‌వారం అమెరికా జర్న‌లిస్టు యూనియ‌న్లు చైనా ప్ర‌భుత్వానికి లేఖ రాశాయి. క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన అత్య‌వ‌స‌ర ప‌రిస్తితుల్లో ప్ర‌పంచంలోని ఏ మూల‌న ఉప‌ద్ర‌వం ఏర్ప‌డినా త‌క్ష‌ణం ప్ర‌పంచం మొత్తానికి చేర‌వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నాయి. ఆసియాకు అస‌లైన రోగి చైనాయే అనే పేరుతో చైనాలోని వాల్‌స్ర్టీట్ జ‌ర్న‌ల్‌లో ఇటీవ‌ల ఓ వ్యాసం ప్ర‌చురించారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చైనా అమెరికా మీడియా సంస్థ‌ల త‌ర‌ఫున ఆ దేశంలో ప‌నిచేస్తున్న విదేశీ జ‌ర్న‌లిస్టులంద‌రినీ బ‌హిష్క‌రించింది.


logo
>>>>>>