బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 28, 2020 , 10:41:02

కేరళ బామ్మకు త్వరలో ఆధార్‌

కేరళ బామ్మకు త్వరలో ఆధార్‌

తిరువనంతపురం: కేరళ బామ్మ భగీరథి అమ్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె త్వరలో ఆధార్‌కార్డును పొందనున్నారు. భగీరథి..105 ఏండ్ల వయసులో నాలుగో తరగతి పాసై ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగో తరగతిలో పాసైన సంతోషం ఉన్నా.. ఆధార్‌కార్డు లేకపోవడంతో పింఛన్‌ పొందలేకపోతున్నానని ఇటీవల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో స్పందించిన ఓ జాతీయ బ్యాంకు అధికారులు కొల్లాం జిల్లాలోని ఆమె ఇంటిని ఇటీవల సందర్శించారు. ఆధార్‌ నమోదుకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు. ‘వృద్ధాప్యం వల్ల భగీరథి అమ్మ వేలి ముద్రలు చెరిగిపోవటంతో ఆధార్‌ నమోదు యంత్రం స్వీకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రక్రియ పూర్తి చేశాం’  అని ఓ అధికారి పేర్కొన్నారు. బామ్మకు రెండు రోజుల్లోగా ఆధార్‌ కార్డు వచ్చే అవకాశమున్నదని చెప్పారు.  
logo