మంగళవారం 31 మార్చి 2020
International - Feb 18, 2020 , 00:52:25

పోలీసు కస్టడీలో రువాండా విప్లవ కవి మృతి

పోలీసు కస్టడీలో రువాండా విప్లవ కవి మృతి

కిగాలి: ప్రభుత్వ నిషేధానికి గురైన ప్రఖ్యాత రువాండా విప్లవ కవి, గాయకుడు కిజిటో మిహిగో పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. అయి తే, అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని ఆ దేశ పోలీసులు సోమవారం పేర్కొన్నారు. కిజిటో మిహిగో కవి, విప్లవ గాయకుడు. రువాం డా అధ్యక్షుడు పాల్‌ కగామే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు గీతాల్ని ఆలపించేవాడు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు  పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ఆయన్ని  2015 లో జైలుకు పంపించింది. 2018 లో జైలు నుంచి బయట కొచ్చిన మిహిగోని... దేశం విడిచి పారిపోతున్నాడన్న కారణంతో మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కస్టడీలో ఉన్న మిహిగో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. 


logo
>>>>>>