బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 14, 2020 , 03:07:12

ఆస్కార్‌కు భారత సంతతి దర్శకుల డాక్యుమెంటరీ

ఆస్కార్‌కు భారత సంతతి దర్శకుల డాక్యుమెంటరీ
  • 11 నామినేషన్లు దక్కించుకున్న హాలీవుడ్‌ మూవీ ‘జోకర్‌'

లాస్‌ఏంజిల్స్‌: సినీ ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డులకు ఎంపికైన నామినేషన్లను ఆస్కార్‌ కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన అమెరికా దర్శకులు రూపొందించిన ‘సెయింట్‌. లూయిస్‌ సూపర్‌మ్యాన్‌' డాక్యుమెంటరీ.. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో నామినేషన్‌ అర్హత సాధించింది. ఈ లఘు చిత్రాన్ని స్మృతీ ముద్ర, సమీ ఖాన్‌ నిర్మించారు. మరోవైపు, జాక్విన్‌ ఫోనిక్స్‌ నటించిన ‘జోకర్‌' సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నది. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌', ‘ది ఐరిష్‌ మ్యాన్‌', ‘1917’ చిత్రాలు 10 విభాగాల్లో అర్హత సాధించాయి. ఆస్కార్‌ చరిత్రలో తొలిసారిగా దక్షిణ కొరియా చిత్రం ‘ప్యారసైట్‌' ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌కు ఎంపికైంది. 92వ అకాడమీ(ఆస్కార్‌) అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 9న అమెరికాలో జరుగనున్నది.
logo